LIC IPO Explained in Telugu: ఎల్ఐసీ ఐపీఓ అప్లికేషన్ కి ముందు తప్పకుండ తెలుసుకోవలసిన ముఖ్యమైన వివరాలు

LIC IPO

భారత మర్కెట్స్ చరిత్రలోనే అతి పెద్ద ఐపీఓకు మే 4న దరఖాస్తులు ప్రారంభం. అందరూ ఎంతో ఆసక్తి తో ఎదురుచూస్తున్న ఎల్ఐసీ ఐపీఓ (LIC IPO) వివరాలు DIPAM సెక్రటరీ తుహిన్ పాండే ఇటీవల జరిగిన ఒక కీలక సమావేశం లో వెల్లడించారు. ఇది అతిపెద్ద ఐపీఓ అయినప్పటికీ , LIC కంపెనీ లో కేవలం 3.5% భాగం మాత్రమే షేర్స్ రూపం లో ఈ ఐపిఓ లో విక్రయించనున్న ప్రభుత్వం. LIC లొ 100% వాటాదారు అయిన భారత ప్రభుత్వం ఈ IPO ద్వారా 3.5% షేర్లు అమ్మి 21000 కోట్ల రూపాయలు జమచేసే అవకాశం . తెలంగాణ (Telangana) మరియు ఆంధ్ర ప్రదేశ్ (ఆంధ్ర ప్రదేశ్) లోని తెలుగు (Telugu ) రీడర్స్ ఈ LIC IPO Explained in Telugu ని చదివి పూర్తి వివరాలు తెలుసుకోవొచ్చు.

పై చిత్రంలో ఉన్న చెన్నై లో ఫేమస్ LIC ఆఫీస్ చారిత్రక బిల్డింగ్. మొదట యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కోసం నిర్మించిన ఈ భవనం విలీనం తరువాత LIC బిల్డింగ్ గ మారింది.

Brief History of LIC: ఎల్ఐసీ కంపెనీ చరిత్ర

మీకు తెలుసా ?

1956 సెప్టెంబర్ లో సుమారు 240 ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలని విలీనం చేసి లైఫ్ ఇన్సూరెన్స్ అఫ్ ఇండియా (Life Insurance of India) అనే ఒక కంపెనీ కి ప్రాణం పోసింది అప్పటి ప్రభుత్వం . ఆనాటి నుండి ఈరోజు వరకు ఇన్సూరెన్స్ ఇండస్ట్రీ లో ఎల్ఐసీ దే ఆధిపత్యం. ఈ 65 సంవత్సరాలలో ఇండియా లోని 90% పైన డిస్ట్రిక్ట్స్ లో LIC విస్తరించింది.

ప్రస్తుతం, అంటే 2022 లో, ముంబై హెడ్ ఆఫీస్ కేంద్రంగా LIC కి మొత్తం 4983 ఆఫీసులు అందులో 113 దివిషనల్ ఆఫీసులు.

LIC కంపెనీ కి Reliance లొ 6% వాటా , TCS లొ 4%, Infosys లొ 6%, SBI లొ 8%, ఇంకా ITC లొ 16% వాటా ఉంది. LIC దేశం లోనే అతి పెద్ద ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్. సుమారు Nifty లొ 4% LIC పెట్టుబడులు.

ఎల్ఐసీ డిజిటల్ సామర్ధ్యం

1956 లో ఎల్ఐసీ స్థాపించినప్పుడు 212 బ్రాంచీలు అవి ఇప్పుడు 4983 అవ్వగా అందులో 2000 పైన ఆఫీసుల పూర్తి డిజిటల్ సామర్ధ్యంతో నడుస్తున్నాయి. దీని తో పాటు ఆన్లైన్ లో ఇన్సూరెన్స్ అమ్మటం ఇంకా డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉపయోగించుకుని ప్రీమియం వసూలు ఇంకా కస్టమర్ రిలేషన్స్ లాంటి సదుపాయాలు ఎల్ఐసీ అందిస్తుంది.

స్థూల దేశీయ ఉత్పత్తి లో సుమారు 7% వాటా ఎల్ఐసీదె. అయితే మరి LIC ని ‘టూ బిగ్ టు ఫెయిల్’ కంపెనీ కింద అనుకోవొచ్చా ?

సగటు రిటైల్ ఇన్వెస్టర్లు ఇలాంటి వివరాల మీద దృష్టి పెట్టాలి. ప్రస్తుతానికి ఎల్ఐసీ మార్కెట్ లీడర్ అయినప్పటికీ , రాబోయే కాలం లో కంపిటిషన్ తట్టుకోగలదా?

ఇప్పుడు కొత్తగా వొచ్చిన ఇన్సూరెన్స్ కంపెనీలు పూర్తిగా డిజిటల్ మీదనే పెట్టుబడి, అంటే భారి ఆఫీసులు, ఎక్కువ ఏజెంట్లు , ఇలాంటి ఖర్చుతో కూడుకున్న వాటి నుంచి కొత్త కంపెనీలకు డిజిటల్ అల్తర్నేటివ్ , దీనితో గ్రాస్ మార్జిన్స్ లో వ్యత్యాసం ఎక్కువ. ఇలాంటి డిజిటల్ సోలుషన్స్ వాడుకొని LIC భవిష్యత్తులో కాంపిటీషన్ తట్టుకుంటుందా అన్న ప్రశ్నకు అవును అనే సమాధానం చెప్పొచ్చు.

2021 లో ఉన్న సమాచారం ప్రకారం , దేశంలోని మొత్తం ఇన్సూరెన్స్ కంపెనీల గ్రాస్ రిటన్ ప్రీమియం (GRP) లో 64.5% వాటా ఎల్ఐసీదే . అంతే కాదు మన దేశం లో ఉన్న మొత్తం ఇన్సూరెన్స్ ఏజెంట్స్ లో 55% ఎల్ఐసీ ఇన్సూరెన్స్ ఏజెంట్లే .

ఎల్ఐసీ ఫైనాన్సియల్స్ వివరాలు

FY20FY21MFY22
మొత్తం ఆస్తులు34,14,174
కోట్లు
3,746,404
కోట్లు
40,90,786
కోట్లు
నికర ప్రీమియం382,475
కోట్లు
405,398
కోట్లు
2,85,341
కోట్లు
నికర లాభం2,710
కోట్లు
2,974
కోట్లు
1,715
కోట్లు
ఇక ఐపీఓ వివరాలు

మొదట ఫైనాన్స్ మినిస్ట్రీ 10% ప్రాదుత్వ వాటాను LIC IPO ధ్వారా విక్రయించొచ్చు అని నిపుణులు అంచనా వేయగా చివరకు 3.5% మాత్రమే అని తేలింది . అంటే ఐపీఓ లో ఒక లాట్ కి ఉండే కంపిటేషన్ ఇంకా పెరిగినట్టు. LIC IPO Price Band 902-949 అని ప్రకటించటం జరిగింది, అంటే ఒక్క షేర్ విలువ 949 అని అనుకోవాల్సిందే .

ఈ లెక్క ప్రకారం అభ్యర్థులు ఒక్క లాట్ కి అప్లై చేయాలి అంటె 14235 రూపాయలు వెచ్చించాలి . అయితే ఒక్కరు కేవలం 14 లాట్స్ మాత్రమే కొనగలరు, 14 లాట్స్ కి మించి ఇండివిడ్యుల్ బిడ్డర్ అప్లై చేయలేరు .

మీ అదృష్టం బాగుండి 14 లాట్స్ మీకు దొరుకుతె, మీరు మొత్తం మీద 2 లక్షల వరకు ఇన్వెస్ట్ చేయగలరు. అప్లికేషన్ తేదీలు మే-4 నుంచి మే-9 వరకు.

లిస్టింగ్ రోజు లాభాలు

చాలా మంది పెట్టుబడి అని కాకుండా కేవలం మార్కెట్ లో లిస్ట్ అయిన మొదటి రోజు లేదా మొదటి వారం లో వొచ్చే లాభాల కోసం ఐపీఓస్ కి అప్లై చేస్తారు. ఎల్ఐసీ ఐపీఓ మే-16 న అల్లొట్మెంట్ జరగనుంది , మే 17 న స్టాక్ మర్కెట్స్ లో లిస్ట్ అవ్వనుంది. అయితే లిస్టింగ్ రోజు లాభాలు ఎంత వొచ్చే అవకాశం అన్నది చెప్పటం కష్టం. ఏదో ఒక నెంబర్ ఇవ్వటం సబబు కాదు. కానీ Grey Market Premium ధ్వారా మీరు ఒక అభిప్రాయానికి రావొచ్చు.

మే 2న LIC IPO Grey Market Premium కొంచం ఊరటను ఇచ్చింది. ప్రస్తుతం 949 కి 75 రూపాయల ఎక్కువగా పలుకుతుంది . ఇది మీరు చదివేసమయానికి ఇంకా పెరిగిఉండవొచ్చు.

రిటైల్ / ఎంప్లాయిస్ / పాలసీ హోల్డర్స్

ఒకవేల మీరు LIC పాలసీ ఉన్నవారు అయితే మీకు 60 రూపాయలు రాయితి ఉంటుంది ఇందుకు మీ PAN ఇంకా పాలసీ జతపరచాలి. ఇంకో ముఖ్యవిషయం , మీ పాలసీ ఫిబ్రవరి 13, 2022 కి ముందు నోమోదు అయి ఉండాలి.

ఒకవేల పాలసీ లేకపోయినా , 2 లక్షల లోపు ఎవరికైనా అంటే రిటైల్ ఇంకా ఎంప్లాయిస్ కి 45 రూపాయల రాయితీ . కేవలం 10% మాత్రమే పాలసీ ఉన్న వారికి రిజర్వ్ చేయబడింది .

LIC IPO కోసం ఎదురుచూస్తున్న వారందిరికి మా తరపున Good Luck . మీకు ఎటువంటి అనుభవం లేకపోయినా మీ UPI apps (ఫోన్ పె , పేటీఎం ) ద్వారా సులభంగా అప్లై చేయవొచ్చు. కొన్ని apps ప్రేఅప్లికేషన్ సౌలభ్యం కూడా కలిపిస్తున్నాయి. LIC IPO గురించి మరింత సమాచారం కొరకు ఈ వెబ్సైట్ ని బుక్మార్క్ చేసుకోండి. లేదా క్రింద Google News లొ ఫాలో అవ్వండి .

Leave a Reply