థైరోయిడ్ తగ్గాలంటే ఏం చేయాలి?

Thyroid Health: థైరాయిడ్ తగ్గాలంటే ఏం చేయాలి? థైరాయిడ్ సమస్య గురించి అన్ని వివరాలు తెలుసుకోండి

చాలా మంది పొరపడేట్టు థైరాయిడ్ అంటే హార్మోన్ కాదు, థైరాయిడ్ మన శరీరంలోని ఒక ఎండోక్రైన్ గ్రంధి. ఇది ఉత్పత్తి చేసే హార్మోన్ ని థైరాయిడ్ హార్మోన్స్ అని అంటారు. కొన్ని అంచనాల ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఎనమిది మంది మహిళలో ఒకరికి థైరాయిడ్ ఉండే అవకాశం ఉంది. వీరిలో 60% మందికి థైరాయిడ్ ఉన్నట్లు కూడా వారికి తెలియదు.

అసలు థైరాయిడ్ ప్రాబ్లెమ్ అంటె ఏమిటి? థైరాయిడ్ సమస్యలు ఎందుకు వస్తాయి?

Everything you need to know about Thyroid Health, what to do to reduce thyroid problems, what food to eat for thyroid problems, etc

థైరాయిడ్ హార్మోన్స్ మన శరీరంలోని జీవక్రియను నియంత్రిస్తాయి , అంటే, మన శరీరం ఆహార శక్తిని వాడుకునే విధానం ఇంకా గుండె కొట్టుకునే వేగం ఇలాంటి ప్రక్రియలలో కీలక పాత్ర పోషిస్తాయి.

హైపోథైరాయిడిజం

ఎప్పుడైతే మన శరీరం లో థైరాయిడ్ హార్మోన్ సరిపడా లేదో దానిని హైపోథైరాయిడిజం (Hypothyroidism ) అని అంటారు

హైపర్ థైరాయిడిజం

ఎప్పుడైతే మన శరీరం లో థైరాయిడ్ హార్మోన్ అధిక మోతాదులో ఉంటుందో దానిని హైపర్ థైరాయిడిజం (Hyperthyroidism ) అని అంటారు

థైరాయిడ్త గ్గాలంటే ఏం చేయాలి ?

థైరాయిడ్ సమస్యలకు చాలా కారణాలు ఉండొచ్చు , ముఖ్యంగా జన్యుపరమయిన కారణం అవొచ్చు. అయితే అది మన చేతిలో ఉండదు. కానీ జీవనశైలి వలనకూడా థైరాయిడ్ సమస్యలు మొదలవొచ్చు. ఈ మధ్యలో ఆహరం, పని ఒత్తిడి, పోషకాల లోపం, ఇలాంటి కారణాల వలన వొచ్చే థైరాయిడ్ సమస్యలు ఎక్కువయ్యాయి.

మొదట తీపి పధార్ధాలు/ చెక్కర తగ్గించండి

అవును మీరు చదివింది కరెక్టే. చెక్కర ఎక్కువ తినటం వలన కేవలం డయాబెటిస్ మాత్రమే కాదు ఇంకా ఎన్నో ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. చెక్కర మరియు నూనె పదార్ధాలు ఎక్కువగా తినటం వలన వొంట్లో వాపు (inflammation) పెరుగుతుంది. ఈ ఇంఫ్లేమేషన్ వల్ల థైరాయిడ్ సమస్యలు ఎక్కువవుతాయి.

పెరుగు లాంటి ప్రోబైయటిక్స్ తినండి

ప్రోబైయటిక్స్ అంటే మన పొట్టలో ఉండే మంచి బాక్టీరియాని పెంచే ఆహరం. అనాదిగ మనం భోజనంలో పెరుగుని తినేది అందుకే. పెరుగు చాలా మంచి ప్రోబైయటిక్. థైరాయిడ్ ఉన్నవారికి పొట్టపేగులో చెడు బాక్టీరియా ఎక్కువగా పెరుగుతుంది. పెరుగు లాంటి ప్రోబైయటిక్స్ తినటం వలన ఇది నియంత్రించవొచ్చు

ఏరోబిక్ వ్యాయాయం తప్పనిసరి

ఏరోబిక్ వ్యాయాయం అంటే గుండె వేగాన్ని పెంచే వ్యాయాయం. పరిగెత్తడం , వేగంగా నడవటం, సైకిల్ తొక్కటం, ఇలాంటివి ఏదైన ఏరోబిక్ వ్యయమే. దీనివలన శరీర ప్రక్రియలు బాగుపడి థైరాయిడ్ సమస్యలు తగ్గుతాయి

ఆపిల్ సైడర్ వెనీగర్ అద్భుతం

ఆపిల్ సైడర్ వెనీగర్ని ఆపిల్ ఫెర్మెంట్ అయినా తరువాత తయారుచేస్తారు. థైరాయిడ్ ప్రోల్మ్స్ ఉన్నవారికి ఇది చాలా బాగా పనిచేస్తుంది. ముఖ్యంగా హార్మోన్ ఉత్పత్తికి తోడ్పడుతుంది. రోజు ఉదయం ఒక గ్లాస్ నీటిలొ ఒకటి లేదా రెండు స్పూన్ వేసుకుని వాడి చూడండి. ఇది తప్పకుండ పనిచేస్తుంది.

ఆహార అలవాట్లు మార్చుకుని ఇంకా స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ అలవాటు ఉన్నవారు అవి మానేసి , వ్యాయాయం చేస్తూ థైరాయిడ్ ప్రొబ్లెమ్స్ నుండి ఉపశమనం పొందొచ్చు. కానీ ఇవి ఏవి పూర్తి పరిష్కారాలు కాదు, మీ సమస్య ని డాక్టర్ కి లేదు హోమియోపతి వారికి చెప్పి దానికి తగిన ట్రీట్మెంట్ సరైన సమయానికి తీసుకోండి.

Leave a Reply