ప్రైవేట్ ఉద్యోగాలను మానేసి 3 నెలలు చదివితె  TSPSC Group 1 ప్రిలిమ్స్ క్లియర్ అవుతుందా?

TSPSC Group 1 Prelims

ఎంతో మంది ప్రైవేట్ ఉద్యోగులను ఇప్పుడు ఆలోచించేలా చేస్తున్న ప్రశ్న ఇది. TSPSC గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదలైన రోజునుండి చాలా మంది అడుగుతున్న ప్రశ్న ఇది.

నేనొక ప్రైవేట్ సంస్ధ ఎంప్లొయి.  చాలా సంవత్సరాల తరువాత  పడిన గ్రూప్ 1 ఉద్యోగాలు మంచి అవకాశం, కానీ ఇప్పుడు ఉద్యోగం మానేసి గ్రూప్ 1 పరీక్షలకు ప్రిపేర్ అవటం మంచి నిర్ణయమేనా ?

నాది మధ్యతరగతి కుటుంబం, అందరూ నా మీద ఆధారపడి ఉన్నారు. ఇప్పుడు ఉద్యోగం మానేసి గ్రూప్ 1 కి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్న. ఇంట్లో అందరూ ప్రోత్సహిస్తున్నారు కానీ నాకు ధైర్యం సరిపోవట్లేదు, అసలు  3 నెలలు చదివి గ్రూప్ 1 ప్రిలిమ్స్ క్లియర్ చేయటం సాధ్యమేనా?

ఇలా ఎన్నో ప్రశ్నలు ప్రైవేట్ సంస్దల ఉద్యోగుల్ని సతమతం చేస్తున్నాయ్, సందిగ్ధం లో పడేస్తున్నాయి

అసలు 3 నెలలు చదివి గ్రూప్ 1 ప్రిలిమ్స్ క్లియర్ చేయటం సాధ్యమో కాదో మనం ఇప్పుడు తెలుసుకుందాం

దీనికి సమాధానం వెతకాలంటే, ముందు మీ గురించి మీరు సరిగ్గా అంచనా వేయగలగాలి. మొదటిగా అడగవలసిన ప్రశ్న , మీరు రోజు వార్తలు చదువుతారా?

మీరు రోజు వార్తలు చదువుతారా? డైలీ న్యూస్పేపర్ చదివే అలవాటు ఉందా?

ఇది చాలా ముఖ్యమైన క్వాలిటీ , ఇది మీలో ఉంటె గ్రూప్ 1 ప్రిలిమ్స్ క్లియర్ చేసే అవకాశాలు ఎక్కువ. రోజు వార్తలు ఇంకా పత్రికలలో కరెంట్ ఈవెంట్స్ పైన ప్రచురింపబడె ఎడిటోరియల్స్ చదివే వారు వారికి తెలియకుండానే గ్రూప్ 1 సిలబస్ కొంతవరకు కవర్ చేసి ఉంటారు. మీరు ఈ గుంపు లో ఉంటె గ్రూప్ 1 ప్రిలిమ్స్ కి ఒక మెట్టు చేరువలో ఉన్నట్లే.

మీరు ఒక పుస్తకాన్ని దృష్టి మరల్చకుండ ఎంతసేపు చదవగలుగుతారు ?

అది పుస్తకం మీద ఆధారపడి ఉంటుందని అందరికి తెలుసు. ఈ ప్రశ్న ముఖ్య ఉద్దెశం, అసలు అన్ని గంటలు కూర్చొని పుస్తక పఠనం చేయడం సులభమైన విషయం కాదు. కొంతమంది పావుగంటకు మించి చదవలేరు. కొంతమంది గంటసేపు చదివినా అందులో చదివిన వాటిని గుర్తుపెట్టుకోలేరు.

గ్రూప్ఎ 1 ప్రిలిమ్స్ కొరకు ఎన్నో టాపిక్స్ ని కవర్ చేయాల్సి వొస్తుంది. ఇందుకు చాలా కాకపోయినా కొన్ని నిర్ణీత పుస్తకాలు కచ్చితంగా చదవాల్సి ఉంటుంది. మీరు ఈ పని చేయగలరా అని ప్రశ్నించుకోండి.

ఒకవేళ మీరు ఈ కోవలో లేకపోతే, కంగారు పడకుండ ముందునుంచే ప్రిపరేషన్ ప్లాన్ మార్చుకోండి. యూట్యూబ్ లాంటి వీడియో లేదా ఆడియో ప్లాట్ఫారం ఎంచుకొని ప్రీ ప్రేపరషన్ ప్లాన్ చేసుకోండి.

మీరు ఇంతకముందు పోటీ పరీక్ష ఏదైనా అట్టెంప్ట్ చేసారా?

ఎలాంటి పోటీ పరీక్షకైనా (ఉద్యోగం కోసం) సిలబస్ లో బేసిక్ టాపిక్స్ కవర్ చేస్తాయి. అంటే భారత చెరిత్ర,రాజ్యాంగం,పరిపాలన విధానం, ఇలాంటి టాపిక్స్. ఒకవేళ మీరు రాసి ఉంటె, బేసిక్స్ మీద మీకు అవగాహనా ఉంటుంది. మీరు ఈ గుంపు లో ఉంటె గ్రూప్ 1 ప్రిలిమ్స్ కి ఒక మెట్టు చేరువలో ఉన్నట్టే.

మీరు గ్రూప్ 1 కోసం చదవాల్సిన పుస్తకాలు (తెలుగు లో)

  • ఇండియన్ హిస్టరీ అండ్ కల్చర్: తెలుగు అకాడమీ పుస్తకం
  • తెలంగాణ హిస్టరీ అండ్ కల్చర్ : తెలుగు అకాడమీ పుస్తకం
  • ఇండియన్ జాగ్రఫీ: BA 3rd ఇయర్ తెలుగు అకాడమీ పుస్తకం
  • తెలంగాణ జాగ్రఫీ: Genius పబ్లికేషన్
  • ఇండియన్ సొసైటీ: తెలుగు అకాడమీ పుస్తకం
  • ఇండియన్ పాలిటి అండ్ గవర్నెన్స్: లక్ష్మీకాంత్
  • ఇండియన్ ఎకానమీ ఫర్ కంపెటేటివ్ ఎగ్జామ్స్: తెలుగు అకాడమీ పుస్తకం
  • సైన్స్ అండ్ టెక్నాలజీ: హరి క్రిష్ణ
  • డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంట్: తెలుగు అకాడమీ పుస్తకం
  • తెలంగాణ స్టేట్ ఫార్మేషన్: తెలుగు అకాడమీ పుస్తకం

3 నెలలు రోజూ 8 గంటలు

నోటిఫికేషన్ లో ఉన్న సమాచారం మేరకు , జూన్ చివరి లో ప్రిలిమ్స్ ఉండే అవకాశం ఉంది. అంటే 3 నెలల గడువు. ఈ 3 నెలలలో రోజూ 8 గంటలు వెచ్చించి పైన ఉన్న పుస్తకాలను కనీసం రెండు సార్లు అయినా చదవాలి. ఇందుకు సరిపడా మానసిక మరియు శారీరక దృఢత్వం మీలో ఉంది అనుకుంటే మీరు గ్రూప్ 1 ప్రిలిమ్స్ క్లియర్ చేయడానికి ఒక మెట్టు చేరువలో ఉన్నట్టే

చాయ్/ టీ స్టాల్ చర్చలు కాదు స్మార్ట్ ప్రేపరషన్ కావలి

ఒకవేళ మీరు కోచింగ్ సెంటర్ కి వెళ్తే, చాలా సమయం చాలా మందిలా చాయ్/ టీ స్టాల్ దెగ్గర చేర్చలలో పోతింది. ఇది మంచిదే, కొత్తవిషయాలు తెలుసోకోవొచ్చు. కానీ ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, ఒక టాపిక్ మీద అంత డిటైల్డ్ గ లేదా డీప్ గ చదవాల్సిన అవసరం లేదు.

ఉన్నది కేవలం 3 నెలలు మాత్రమె, కాబట్టి స్మార్ట్ ప్రేపరషన్ అవసరం. ఎంతవరకు తెలుసుకోవాలి అంత వరకు తెలుసుకుని మిగిలింది వదిలేయడమే స్మార్ట్నెస్.

గ్రూప్ 1 ప్రిలిమ్స్ కి స్మార్ట్ ప్రేపరషన్ ఎలా?

స్మార్ట్ ప్రేపరేషన్ అంటే తెలివిగా ఇంటర్నెట్ లో దొరికే మెటీరియల్ అండ్ నోట్స్ ద్వారా మరియు మోక్ టెస్ట్స్ ని వాడుకొని తక్కువ సమయం లో ఎక్కువగా ముఖ్యమైన టాపిక్స్ ని కవర్ చేయటం. పాతకాలం ప్రేపరషన్ లాగా కోచింగ్ సెంటర్స్ కి వెళ్లి , ప్రేతి పుస్తకంను చదివి, ప్రీతిది నోట్స్ రాసుకునేంత టైం లేదు. అందుకే స్మార్ట్ ప్రేపరషన్.

పైన చర్చించిన అంశాలు ఇంకా పర్సనల్ స్టేట్ అఫ్ మైండ్ అర్ధం చేసుకుని. తెలివిగా ప్రిపేర్ అవుతే 3 నెలలో ప్రిలిమ్స్ క్లియర్ చేయొచ్చు. మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, అందరూ మీలా ప్రేపరషన్ స్టార్ట్ చేయాల్సిందే. ఆల్రెడీ సివిల్స్ లాంటి పరీక్షలకు ప్రిపేర్ అయ్యే వారు కూడా చాలా సిలబస్ కొత్తగా చదవాల్సిందే. దృఢ సంకల్పం ఇంకా చేయగలను/ సాధించగలను అనే నమ్మకం ఉంటె మీరు కచ్చితంగా 3 నెలల కాలంలొ ప్రిలిమ్స్ క్లియర్ చేస్తారు.

అల్ ది బెస్ట్ . గుడ్ లక్.



Leave a Reply